నేను రెడీ.. నువ్వు రెడీనా? తొడగొట్టి ఛాలెంజ్ చేసిన బుద్ధా వెంకన్న..!

Monday, October 21st, 2019, 08:32:35 PM IST

ఏపీలో ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా కూడా ఏపీ రాజకీయాలలో వేడి తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే మరింత రసవత్తరంగా కనిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారు విమర్శలు గుప్పించడం సర్వసాధారణం. అయితే ఏపీలో మాత్రం ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా? అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా నువ్వు, మీ తుగ్లక్ జగన్ గుర్తుందా అని అడుగుతూ తీరా మీకు 22 ఎంపీలని ఇస్తే రాష్ట్రం కోసం పోరాడాల్సింది మానేసి మీ కేసుల మాఫీ కోసం వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసారు కదా శకుని మామా! పైగా రాష్ట్ర ఆర్ధిక స్థితి అప్పులు అంటూ మంగళారం కబుర్లోకటి అంటూ ఎద్దెవా చేశారు. అంతేకాదు మడమ తిప్పామ్, మాట మార్చామ్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే, మీ మహమేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబుగారు చేసిన అప్పులు సృష్టించిన సంపదపై నీతో చర్చకు నేను సిద్ధం. మరి నువ్వు సిద్ధమా శకుని మామా అంటూ సవాల్ విసిరారు.