కంటివెలుగులో నీ కళ్ళు చూపించుకో.. సైరాపై బుద్ధా వెంకన్న సెటైర్లు..!

Thursday, October 10th, 2019, 07:30:41 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఏపీ రాజకీయాలలో ఇంకా వేడి తగ్గలేదనే చెప్పాలి. అటు టీడీపీ, వైసీపీ నేతల మధ్య గత కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. అయితే ఈ మాటల తూటాలకు ఇప్పుడు సోషల్ మీడియానే పెద్ద వేదికగా మారిపోయింది. గత కొద్ది రోజుల నుంచి టీడీపీ నేత బుద్ధా వెంకన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ ట్వీట్ల ద్వారా పెద్ద రచ్చే జరుగుతుంది.

అయితే తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై దిమ్మతిరిగే సెటైర్లు వేశారు. అయితే నేడు సీఎం జగన్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ముందు నీ కళ్ళు బాగుచేయించుకో శకుని మామా అని చెబుతూ చంద్రబాబు గారు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి e-eye కేంద్రాలకు మహమేత పేరుపెట్టి కంటి వెలుగు అని ప్రారంభోత్సవం చెయ్యడానికి తుగ్లక్ జగన్ సభ కోసం 50 ఏళ్లనుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్ళు కూలగొట్టారు, వాళ్ళ జీవితాల్లో చీకటి నింపారని ట్వీట్ చేశారు.