జనం మీ మొహం మీద ఉమ్ముతారు.. సైరాపై బుద్ధా వెంకన్న సంచలనం..!

Sunday, October 20th, 2019, 07:39:12 PM IST

ఏపీలో ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా కూడా ఏపీ రాజకీయాలలో వేడి తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే మరింత రసవత్తరంగా కనిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారు విమర్శలు గుప్పించడం సర్వసాధారణం. అయితే ఏపీలో మాత్రం ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి జగన్, విజయసాయి రెడ్డిపై దిమ్మతిరిగే ఆరోపణలు చేశారు. మంగళవారం కబుర్లు ఎందుకు శకుని మామా? క్విడ్ ప్రో కో, ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ లాండరింగ్, సూట్ కేస్ కంపెనీలకు పేటెంట్ రైట్స్ మీ తుగ్లక్ జగన్ దగ్గరే ఉన్నాయి కదా శకుని మామా!! నువ్వు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు నీ మొహం మీద ఉమ్మటం ఖాయమని, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయ్యింది ఒక్క ఎకరం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని నిరూపించలేకపోయావ్, అయినా సిగ్గు లేని మాటలు మాట్లాడతావంటూ, అమరావతి నిర్మాణం ఇష్టం లేకపోతే దైర్యంగా ప్రకటించండి. అప్పుడు తెలుస్తుంది అమరావతి బంగారు బాతో లేక మీ ప్రభుత్వానికి పాడె కట్టబోయే మొదటి అంశమో అని మండిపడ్డారు.