వైసీపీ ఎమ్మెల్యే రోజాకు బంఫర్ ఆఫర్.. షాక్‌లో జగన్..!

Sunday, October 20th, 2019, 04:51:05 PM IST

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు మరో బంఫర్ ఆఫర్ వచ్చింది. నగరి ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి గెలిచిన రోజాకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని సమీకరణాల నేపధ్యంలో రోజాకు కేబినెట్‌లో అవకాశం లభించలేదు. అయితే రోజాకు కేబినెట్ హోదా కలిగిన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని అప్పచెప్పారు జగన్.

అయితే ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా కూడా బాధ్యతలు ఉండడంతో జబర్దస్త్ షోను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయ బాధ్యతలు తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం జగన్ రోజాను హెచ్చరించారని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్ని అవాస్తవం అనిపించేలా ఒక ఎమ్మెల్యేగా, మరొపక్క జబర్దస్త్ జడ్జ్‌గా రోజా హుందాగానే వ్యవహరిస్తూ తన పని తాను చేసుకుంటూ వెలుతుంది. అయితే తాజాగా రోజా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగన్ సిద్దం చేసుకుందని సమాచారం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవర్‌పుల్ లేడీ విలన్ పాత్రలో రోజా కనిపించబోతున్నారని సమాచారం. అయితే గతంలో బాలయ్య సరసన ఏడు సినిమాలలో నటించిన రోజా ఈ సినిమాలో నటించాలా వద్దా అనే డైలామాలో పడిందట. హీరోగా పక్కన్న పెడితే బాలయ్య ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే కావడం, రోజా అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో కాస్త వెనకాడుగు వేస్తున్నారని ఈ విషయంపై అధినేత జగన్‌తో చర్చించాక తన నిర్ణయాన్ని తెలుపుతానని రోజా చెబుతుందట. ఏదేమైనా వీరిద్దరు కలిసి నటిస్తే అటు బాలయ్య నుంచి టీడీపీ అభిమానులు, ఇటు రోజా నుంచి వైసీపీ అభిమానులు బరిలో దిగిన పల్నాటి పుంజుల వేటగా భావించడం ఖాయం.