బ్రాండ్స్ లో మహేష్ ను మించి పోతున్న బన్నీ

Wednesday, January 10th, 2018, 01:04:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి టాలీవుడ్ లో మాంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. సినిమాల విషయం లో మహేష్, బన్నీకంటే కాస్త సీనియర్. కానీ ఎవరి మార్కెట్ వారికి వుంది. బ్రాండ్స్ విషయం లో కూడా అంతే. మహేష్ బాబు థమ్స్ అప్, చెన్నై సిల్క్స్, గోల్డ్ విన్నర్, లోయ్డ్, ప్రోవోగ్, మహీంద్రా ట్రాక్టర్లు, పారగాన్, ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు డజను పైచిలుకు బ్రాండ్ లకు ఆయన అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలానే బన్నీ కూడా లాట్, హీరో గ్లామర్, ఫై అండ్ హ్యాండ్సమ్, కోల్గేట్, రెడ్ బస్, ఓ ఎల్ ఎక్స్ ఇలాంటివి దాదాపు పది పైచిలుకు ప్రముఖ బ్రాండ్లు తన ఖాతాలో వున్నాయి. ఇప్పుడు ఈ విషయం లోనే బన్నీ, మహేష్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ‘పార్లే’ కి చెందిన ఫ్రూటీ ఉత్పత్తులకు బన్నీ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంట్రాక్టు విషయంలో సంతకాలు కూడా పూర్తి అయినట్లు అంటున్నారు.

ఇకనుండి రానున్న రోజుల్లో ఫ్రూటీ పాక్స్ పైనా దానికి సంబంధిన హోర్డింగ్ ల లోను, యాడ్స్ లోను బన్నీ పేరు మారుమ్రోగనుంది. దక్షిణ ఆసియా శీతల పానీయాల్లో పార్లే కి మంచి పేరు వుంది. ఫ్రూటీ, యాపీ ఫీజ్, బెయిలీ, ఫ్రీయో వంటి ఉత్పత్తులు ఈ కంపెనీవే కావడం తో కంపెనీ టర్నోవర్ వేలకోట్లలో వుంది. వచ్చే 2022 నాటికి వీరి టర్నోవర్ 10 వేల కోట్లకు పెంచదమే టార్గెట్ గా చేపట్టిన ఈ నూతన ప్రచార కార్యక్రమం లో ఆయన్ని ఒక భాగస్వామిగా చేయడమే కాకుండా కోట్ల రూపాయల పారితోషికం కూడా ముట్టచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే వున్న బ్రాండ్ల తోపాటు పార్లే వారి ఈ నూతన బ్రాండ్ కూడా తన ఖాతాలో చేరడంతో బన్నీ, మహేష్ బాబు పై కొంత పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది….