అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ల తో జత కట్టనున్న బన్నీ?

Friday, January 12th, 2018, 12:10:52 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ లు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన అభిమానులు విడుదలయ్యే ఆయన చిత్రాల్లో ఏదో ఒక మంచి డాన్స్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు అంతకు మించిన వార్త ఒకటి బన్నీ ఫాన్స్ కి మరింత కిక్ ఇవ్వనుంది. ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘నా పేరు సూర్య’ లో అదిరిపోయే లెవెల్లో ఒక పాట ఉందని, దీన్ని అమెరికా, పారిస్ లో చిత్రీకరించనున్నారని అలాగే అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కొరియోగ్రాఫర్లు ఈ పాటకి పనిచేయనున్నారనే వార్త ఒకటి అందుతోంది. ఇదే కనుక నిజం అయితే అల్లు అర్జున్ ఫాన్స్ కి ఇంకా పండుగనే చెప్పాలి. మామూలుగానే డాన్సులతో ఫాన్స్ మతి పోగొట్టే బన్నీ, ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్స్ తో పని చేసిన పాటంటే ఇంకెన్ని విధాలుగా తన డాన్స్ తో మేజిక్ చేస్తాడో అని ఫాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కె. నాగ బాబు సమర్పణలో, రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం పై లగడపాటి శిరీష శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిష్టున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న విడుదలకానుందని సమాచారం.