బన్నీ కోసం ముగ్గురు దర్శకులు?

Thursday, June 14th, 2018, 07:16:03 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక సినిమాను ఒకే చేయడానికి సమయం చాలానే తీసుకుంటున్నాడు. గతంలో ఒక సినిమా మొదలుపెట్టిన తరువాత ఏ దర్శకుడితో చేయాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉండేవాడు. కానీ ఇప్పుడు నా పేరు సూర్య సినిమా తరువాత బన్నీ మరో కథను ఒకే చేయలేదు. వివిధ రకాలుగా అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చిన వాటిపై బన్నీ వివరణ ఇవ్వలేదు. ఇకపోతే బన్నీతో చేయడానికి ముగ్గురు దర్శకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముందు మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తోనే బన్నీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆయన స్క్రిప్ట్ పనులు ఎండింగ్ కు వచ్చేశాయట. బన్నీ ఇప్పుడు విహార యాత్రల్లో ఉన్నాడు. ఆ ట్రిప్ ముగియగానే నెక్స్ట్ ప్రాజెక్టును ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ – సురేందర్ రెడ్డి ప్రాజెక్టులకు అల్లు అర్జున్ ఒకే చెప్పాడని టాక్. ప్రస్తుతం ఆ స్టార్ దర్శకులు చాలా బిజీగా ఉన్నారు. మరి బన్నీ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments