హాట్ టాపిక్‌ : 2.ఓ నిర్మాత‌ల‌పై బ‌న్ని వాసు స్ట్రైక్‌!!

Sunday, December 3rd, 2017, 09:06:44 PM IST

నంది పుర‌స్కారాల్లో అన్యాయంపై గొంతెత్తి ఇదేం అన్యాయం అని ప్ర‌శ్నించాడు యువ‌నిర్మాత బ‌న్ని వాసు. ఇండ‌స్ట్రీకి 50 శాతం కంట్రిబ్యూష‌న్ ఇచ్చే మెగా హీరోల్ని కావాల‌నే ప‌క్క‌న‌పెట్టి, అర్హ‌త లేని సినిమాల‌కు అవార్డులిస్తారా? అంటూ ఫైరయ్యాడు. ప‌వ‌న్‌, బ‌న్ని లాంటి స్టార్ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని మొహమాటం లేకుండా టీవీ చానెళ్ల లైవ్‌లో దులిపేశాడు. అస‌హ‌నం బ‌డ‌భాగ్నిలా మారితే ఎలా ఉంటుందో నంది క‌మిటీకి, ఏపీ ప్ర‌భుత్వానికి తెలిసొచ్చింది దెబ్బ‌కు.

ఈసారి కూడా అదే స‌న్నివేశం. అయితే ఈసారి అత‌డి ఫైరింగ్ ప్ర‌ఖ్యాత‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌పై. 2.ఓ రిలీజ్ విష‌యంలో ఈ సంస్థ వాయిదాల ఫ‌ర్వాన్ని సూటిగా ప్ర‌శ్నించాడు. ఇలా చేస్తే ఇత‌ర సినిమాలు ఏమైపోవాలి? అని ప్ర‌శ్నించాడు. “మీపై గౌర‌వం ఉంది. అలాగ‌ని మీ సినిమా రిలీజ్ తేదీ ఇన్ని సార్లు వాయిదాలు వేస్తే ఎలా? దానివ‌ల్ల ప్రాంతీయ సినిమాల ప‌రిస్థితి ఏం కాను? ఇది త‌గ‌నిది. ప్ర‌తిసారీ రిలీజ్ తేదీ మార్చ‌డం వ‌ల్ల ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగుతోంది. ఈ విష‌యాన్ని ఏపీ, తెలంగాణ‌లో నిర్మాత‌ల మండ‌లి, ఎగ్జిబిట‌ర్ల సంఘాల‌కు ఫిర్యాదు చేస్తాను. ఇక‌పై ఎవ‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం“ అని అన్నాడు. బ‌న్ని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ `నా పేరు సూర్య‌`, మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న `భ‌ర‌త్ అనే నేను` చిత్రాలు ఏప్రిల్‌లో రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు ఇదివ‌ర‌కూ. అయితే బ‌న్ని వాసు .. కాంపిటీట‌ర్ అయిన డివివి దాన‌య్య‌తో క‌లిసి మంత‌నాల సాగించి క్లాషెస్ రాకుండా మాట్లాడుకున్నారు. ఇదే విష‌యాన్ని బ‌న్ని వాసు గుర్తు చేశారు. మామ‌ధ్య క్లాషెస్ వ‌స్తే మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2.ఓ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించి, మీరే పోటీకొస్తున్నారు. మా ప‌రిస్థితి ఏం కావాలి? అని లైకా సంస్థ‌ను సామాజిక మాధ్య‌మంలో షూటిగా నిల‌దీశాడు.

  •  
  •  
  •  
  •  

Comments