నంది అవార్డులపై నిర్మాత కౌంటర్.. మెగా హీరోలు నేర్చుకోవాలి?

Wednesday, November 15th, 2017, 04:41:06 PM IST

నటి నటులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నంది బహుమతులలో రాజకీయ హస్తం ఉందని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఈ నంది పురస్కారాలపై సినీ నిర్మాత బన్నీ వాసు హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసిన బన్నీ వాసు పోస్ట్ చేసిన మరో నిమిషంలోనే డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే బన్నీ వాసు అల్లు అర్జున్ ఫ్రెండ్ అని అందరికి తెలిసిందే. అయితే అయన ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేయడం వైరల్ అయ్యింది. మెగా హీరోలు టీడీపీ ప్రభుత్వం నుండి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని ఏపీ అవార్డులను సొంతం చేసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ నిజంగా బన్నీ వాసూనే చేశాడా లేక ఎవరైనా ఫెక్ ఎకౌంట్ తో చేశారా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే హాట్ టాపిక్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments