బర్నింగ్ ఇష్యూ : శ్రీ రెడ్డి వాళ్లనే ఎందుకు టార్గెట్ చేసింది!

Thursday, April 12th, 2018, 03:10:35 PM IST

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయమై కొందరు సినీ ఇండస్ట్రీ వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని, అలానే శారీరకంగా కూడా బలవంతం చేశారని శ్రీ రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఆమె ఇప్పటికే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరాం ఫోటోలు మీడియా కి విడుదల చేశారు. ఆ పై ఒక నాచురల్ స్టార్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవా హర్ష, నిన్నేమో ఒక ప్రముఖ డైరెక్టర్, అలానే ఒక రైటర్ లతో వాట్సాప్ చాట్ చేసినా స్క్రీన్ షాట్స్ విడుదల చేసి సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఆమె పలుమీడియా చానెల్స్ కి వెళ్లి తన ఆవేదనను, తనకు జరిగిన వేధింపుల విషయాన్ని వారి ముందు చెప్తున్న శ్రీరెడ్డి, ప్రముఖులనే ఎందుకు టార్గెట్ చేస్తోందని కరాటే కళ్యాణి, సత్య చౌదరి వంటివారు ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఆమె వెనుక కొందరు వుండి నడిపిస్తున్నారని, శ్రీరెడ్డి స్వలాభంకోసమే ఇదంతా చేస్తోందని, ఇలా చేస్తే తనకు పాపులారిటీ వస్తుందని శ్రీరెడ్డి భావిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి మాత్రం వారి వాదనను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తనకు జరిగిన అన్యాయం మరి ఏ తెలుగు అమ్మాయికి జరగకూడదని, ఇండస్ట్రీకి ఇకపై అవకాశలకోసం వచ్చే తెలుగు అమ్మాయిల ఎవరైనా ఎటువంటి ఇబ్బందులపాలు కాకూడదనేదే తన ప్రయత్నమని ఆమె అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం శ్రీరెడ్డి చేస్తున్న ఈ లీక్స్ వల్ల టాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments