జనసేన పార్టీ కి విరాళాన్ని అందించిన బర్నింగ్ స్టార్…

Thursday, August 22nd, 2019, 02:37:50 AM IST

ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి, కొబ్బరి మట్ట చిత్ర బృందం విరాళం అందించింది. కాగా కొబ్బరి మట్ట చిత్ర కథానాయకుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, మరియు సాయి రాజేష్ కలిసి జనసేన పార్టీకి లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. కాగా ఈ విషయాన్ని సంపూర్ణేశ్ బాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా ఆ ట్వీట్ చుసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సంపూర్ణేష్ బాబు కి ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశారు… కాగా కొబ్బరి మట్ట చిన్న సినిమా అయినప్పటికీ కూడా, తాను సాధించిన విజయానికి బాధ్యతగా జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం పట్ల అభిమానులందరూ కూడా సంపూర్ణేష్ బాబు పై ప్రశంశల వర్ష కురిపిస్తున్నారు.

కాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజాగా నటించిన కొబ్బరిమట్ట చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది… కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.12 కోట్లకుపైగా వసూలు చేసిందని ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు… కాగా ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా సంపూర్ణేష్ బాబు కేరళ వరద బాధితుల కోసం రూ.2 లక్షలు విరాళం కూడా ఇచ్చారు. కాగా ఈమేరకు సంపూర్ణేష్ బాబు ఒక ట్వీట్ చేశారు. “ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా ‘హృదయ కాలేయం’ నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. నా వంతుగా రూ.2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను” అంటూ తన బాధ్యతను అందరికి తెలిసేలా పోస్టు చేశారు సంపూర్ణేష్ బాబు.