లేటెస్ట్ వైరల్ న్యూస్ : సెల్‌ఫోన్ కొనండి, ఉల్లిపాయలు తీసుకెళ్లండి – లేట్ ఎందుకు మరి…?

Friday, December 6th, 2019, 04:59:39 PM IST

ఇటీవల కాలంలో ఎక్కడ కూడా ఉల్లిపాయలు సరిగ్గా కనబడటమే కరువయ్యాయి. ఎంత రేటు పెట్టి కొందామని అనుకున్నప్పటికీ కూడా ఉల్లిపాయలు దొరకని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కాగా చివరికి విదేశాల నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఆలా దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు అందరికి అందడం లేదు. అయితే ఈనేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఫోన్లు అమ్మే దుకాణం ఒక అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. ఇక్కడ సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది…

అంతే ఇక అది చుసిన జనాలు అందరు కూడా ఎగబడి మరి సెల్‌ఫోన్లు కొనుక్కుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లో కూడా ఉల్లి ప్రభావం కూడా బాగానే ఉంది. రోజురోజుకి ఉల్లి ధరలు పెరుగుతున్నాయే తప్ప, కిందకి దిగడం లేదు. అయితే ఈమేరకు వారణాసిలోని లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్, అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ కొంటె కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇక చుడండి అసలు కథ… ఉల్లిపాయల కోసమైనా కొత్త స్మార్ట్ ఫోన్లను కొనడానికి జనాలు ఎగబడుతున్నారు…