బంగారం కొనాలనుకున్నారో? కాల్తుంది జాగ్ర‌త్త‌!!

Tuesday, February 21st, 2017, 11:48:56 AM IST


కేంద్రం బంగారాన్ని టార్గెట్ చేసింది. ఇక నుంచి బంగారం కొనుగోళ్ల‌పై కొత్త బాదుడుకు తెర తీసింది. టీసీఎస్ పేరుతో కొత్త ప‌న్నును అమ‌ల్లోకి తెచ్చింది. ఇక నుంచి 2ల‌క్ష‌లు మించి క్యాష్ తో బంగారం కొంటే దానిపై 1 శాతం (రూ.2000) టీసీఎస్ చెల్లించాల‌ని కొత్త చ‌ట్టం చేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకొస్తుంద‌ని ప్ర‌క‌టించేసింది. అంటే ప్ర‌తి 10 ల‌క్ష‌ల కొనుగోళ్ల‌పై రూ.20,000 చెల్లించుకోవాల్సిందే. ఇప్ప‌టికే షాపుల‌కు వ్యాట్‌, స‌ర్వీస్ ఛార్జ్ పేరిట బోలెడంత చెల్లిస్తున్న కొనుగోలుదారుడు మ‌రింత‌గా ప‌ళ్లూడ‌గొట్టుకునే ప‌రిస్థితి నెల‌కొంది.

అస‌లు టీసీఎస్ అంటే కొనుగోలు దారుడు అమ్మ‌కం దారుడికి ఇచ్చే మొత్తంనే ఇలా పిలుస్తారు. ఐటీ 1961లోని సెక్ష‌న్ 206 సీ చ‌ట్టం ప్ర‌కారం ఈ కొత్త రూల్ వ‌ర్తిస్తుంది. అయితే బంగారంను క్యాష్ రూపంలో కాకుండా చెక్‌లు, డ్రాఫ్టులు రూపంలో కొంటే టీసీఎస్ వ‌ర్తించ‌దని చ‌ట్టం చెబుతోంది. ఈ కొత్త‌ చ‌ట్టం తేవ‌డం ద్వారా కేంద్రం క‌న్ను బంగారం వినియోగ‌దారుల‌పై ప‌డింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలోనూ ప్ర‌భుత్వాలు ఇలాంటి చ‌ట్టం తెచ్చినా మ‌హిళ‌ల ఆగ్ర‌హంతో మ‌ళ్లీ చ‌ట్టంని వెన‌క్కి తీసుకున్నారు. మ‌రి ఇప్పుడు కేంద్రం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.