ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్…

Wednesday, May 9th, 2018, 01:00:16 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుంది. తొలి షెడ్యూల్‌లో రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీకరించార‌ని టాక్‌. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ త‌న మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకున్నాడు. ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వ‌ర్యంలో భారీ వ‌ర్కవుట్స్ చేసి స‌రికొత్త లుక్‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర స‌రికొత్త‌గా ఉంటుంద‌ని, ఆయ‌న స్లాంగ్ రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి అసామాన్యుడు అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటు ఎన్టీఆర్‌, అటు త్రివిక్ర‌మ్‌లు ఇద్ద‌రు ఈ టైటిల్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుండ‌డంతో ఇదే ఫైనల్ అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.