మహేష్ చిత్రం పై కెమరామెన్ కామెంట్!

Thursday, January 25th, 2018, 04:08:01 PM IST


మహేష్ బాబు 24 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వం లో జరుగుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం డెబ్బయి శాతం పైగా పూర్తి అయిందని సమాచారం అందుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ కథానాయిక యంఎస్ ధోని మూవీ ఫేమ్ కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ చుట్టుప్రక్కల జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదట రవి కే చంద్రన్ ను కెమెరామెన్ గా తీసుకున్నారు, కాని తర్వాత ఏమి జరిగిందో , కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆయన తప్పుకుని ఇదివరకు కొరటాల తెరకెక్కించిన జనత గ్యారేజీ చిత్రానికి పనిచేసిన తీరు నే మళ్ళి ఈ చిత్రానికి తీసుకున్నారు. ఆ చిత్రంలో ఆయన కెమెరా పనితనం చాలా బాగుందనే అనే చెప్పాలి, ముఖ్యంగా ఫైట్ సీన్ ల చిత్రీకరణ అద్భుతంగా ఉందని మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఆయన మహేష్ తో చేస్తున్న ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పాట్ లైట్స్ తో వున్న ఒక ఫోటో షేర్ చేస్తూ క్లైమాక్స్ ఇలా ఉండబోతోందని ట్వీట్ చేశారు. దీనితో మహేష్ అభిమానులు ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ చిత్రంలో కూడా ఆయన కెమెరా పనితనం సూపర్ గా ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో నిర్మాత దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా వేసవి కానుకగా ఏప్రిల్ లో 27న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.