చంద్రబాబు,జూనియర్ ఎన్టీఆర్..వైరల్ అవుతున్న సంచలన మ్యాటర్!

Tuesday, August 20th, 2019, 10:56:03 AM IST

ఏపీలోని ఎన్నికల ఫలితాలు ఏ ముహూర్తాన బయటకు వచ్చాయో కానీ అప్పటి నుంచి మాత్రమే కాకుండా అంతకు ముందు నుంచి కూడా వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీకు ఏపీలో నూకలు చెల్లిపోయినట్టే అని అంతా అనుకునేవారు.అందుకు తగ్గట్టుగానే ఊహించని స్థాయి పరాజయాన్ని టీడీపీ మూటగట్టుకుంది.ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే టీడీపీ నుంచి దండ నుంచి ఒక్కో పూస జారిపోతున్నట్టుగా ఒక్కొక్క నేతా మెల్లగా టీడీపీ నుంచి జారుకుంటూ వెళ్లిపోతున్నారు.ఇదే ఇంకా కొనసాగితే మాత్రం తెలుగుదేశం పార్టీకు ఇక పుట్టగత్తులు అనేవి ఉండవు.

ఎన్నో దశాబ్దాల మహా వృక్షం ఇక శాశ్వతంగా భూస్థాపితం అయ్యిపోయినట్టే అని చెప్పాలి.దీనితో చంద్రబాబు తన చాణక్యానికి పదును పెట్టారట.ఎంతో కాలం నుంచి పార్టీకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా అయినా రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారట.ఇది వరకు తెలంగాణలోనే తారక్ సోదరి అయినటువంటి నందమూరి సుహాసినిని ఎన్నికల్లో దింపి అలా తారక్ ఏమన్నా వస్తే తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేసారు కానీ తారక్ అందుకు తావివ్వలేదు.

కానీ తాజాగా మాత్రం స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తారక్ ను కలిసిన చంద్రబాబు చాలా విషయాలే చర్చించారని తెలుస్తుంది.పార్టీ భవితవ్యాన్ని,ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించమని కోరినట్టు కూడా సమాచారం కానీ ఇక్కడే మరో అంశం కూడా సంచలనం రేపుతోంది.తారక్ తెలుగుదేశం పార్టీను కాదని వైసీపీ వైపు నిలబడతారా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి ఇప్పుడు మాత్రం తారక్ పరిస్థితి చాలా సందిగ్ధంలో ఉందనే చెప్పాలి.మరి ఇలాంటి పరిస్థితుల్లో తారక్ తీసుకునే ఎలాంటి నిర్ణయం అయినా సరే ఇప్పుడు సంచలనంగా మారడం ఖాయమని చెప్పాలి.