ఓవ‌ర్సీస్ రికార్డుల‌ పై తార‌క్ క‌న్ను?

Sunday, September 30th, 2018, 11:21:27 AM IST

యంగ్ య‌మ ఎన్టీఆర్ ఓవ‌ర్సీస్ రికార్డుల‌పై క‌న్నేశాడా? అంటే అవున‌నే తాజా స‌న్నాహ‌కం చెబుతోంది. తార‌క్ న‌టించిన అర‌వింద స‌మేత ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న‌ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే రెండు వారాల ముందే ఓవ‌ర్సీస్ ఆన్‌లైన్ బుకింగ్స్ తెరుచుకున్నాయి. అంటే ప్రీమియ‌ర్ల రూపంలో రికార్డులు, అలానే అమెరికాలో రికార్డుల‌పైనా తార‌క్ క‌న్నేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక‌పోతే ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం నాన్ బాహుబ‌లి రికార్డుల్ని అందుకుంది. ఇటీవ‌లే రిలీజైన గీత‌గోవిందం ఓవ‌ర్సీస్‌లో టాప్ రేంజు క‌లెక్ష‌న్స్ సాధించింది. ఆ క్ర‌మంలోనే తార‌క్ అర‌వింద స‌మేత అన్ని రికార్డుల్ని కొట్టేస్తూ ముందుకెళుతుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవ‌ర్సీస్‌లో 3.5-4 మిలియ‌న్ డాల‌ర్లు అర‌వింద స‌మేత వ‌సూలు చేయ‌గ‌లిగితే రికార్డుల‌కు చేరువైన‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది. 3.5 మిలియ‌న్ డాల‌ర్ ల‌క్ష్యం… అంటే 20కోట్లు పైగా వ‌సూళ్లు ద‌క్కిన‌ట్టే. అందుకే చాలా ముందే బుకింగ్స్ ఓపెన్ చేసి ప్లాన్డ్‌గా ముందుకెళుతోంది హారిక సంస్థ‌. అయితే ఓవ‌ర్సీస్‌లో `అజ్ఞాత‌వాసి` డిజాస్ట‌ర్ కావ‌డంతో నిర్మాత రాధాకృష్ణ ఈసారి పంపినీ హ‌క్కుల్ని వేరొక కొత్త సంస్థ‌కు క‌ట్ట‌బెట్టార‌న్న ప్ర‌చారం సాగింది. దాదాపు 14 కోట్ల మేర ఓవ‌ర్సీస్ బిజినెస్ సాగింద‌ని తెలుస్తోంది.