కేన్స్- 2018 రెడ్‌కార్పెట్‌పై క్వీన్ వెలుగుజిలుగులు

Tuesday, April 24th, 2018, 10:06:53 PM IST

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓ భారీ యాక్సిడెంట్ నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డింది. ప్రాణాపాయ‌మే త‌ప్పింది. అదంతా అటుంచితే, మ‌రోవైపు క్వీన్ ప్ర‌భ దేశ‌, విదేశాల‌కు విస్త‌రిస్తున్న వైనం వెలుగు చూసింది. ఈసారి ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ -2018 ఉత్స‌వాల‌కు ప్ర‌త్యేకించి కంగ‌న‌కు ఆహ్వానం ల‌భించింది. ప్ర‌తిసారీ.. ఐశ్వ‌ర్యారాయ్‌, ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొన్ వీళ్ల‌లో ఎవ‌రో ఒక‌రి పేరు వినిపించేది. కానీ ఈసారి డిఫ‌రెంటుగా ఆ అవ‌కాశం క్వీన్‌ని వెతుక్కుంటూ వ‌చ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కంగ‌న కేన్స్‌లో రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో అద‌ర‌గొట్టేయ‌బోతోంది. ఓ ప్ర‌ముఖ బ్రాండ్‌కి ప్ర‌మోష‌న్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అలానే భార‌తీయ సినిమా బ్రాండ్ అంబాసిడ‌ర్ హోదాలోనూ క్వీన్‌కి ఈ అవకాశం, అదృష్టం వ‌రించాయి. కంగ‌న‌కు కేన్స్ ఇన్విటేష‌న్ త‌న కెరీర్‌లో ఇదే తొలిసారి కావ‌డంతో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments