టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు రికార్డులు చెరిపేయనున్నడా..!

Thursday, June 13th, 2019, 02:39:14 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే ఆడిన రెండు మ్యాచులలోనూ జట్టును గెలిపించి నేడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో కూడా విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే టీమిండియా ఓపెనర్ శికర్ ధావన్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ధావన్ స్థానంలో కేఎల్ రాహులు జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే మంచి ఫాంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈ రోజు ఎలాగైనా ఓడించి తమ సత్తా నిరూపించాలని కోహ్లీ భావిస్తున్నాడు. అయితే కోహ్లీ ఈ రోజు మ్యాచ్‌లో మంచి ఆటను కనబరిస్తే సరికొత్త రికార్డ్‌లు సొంతం చేసుకోబుతున్నాడు. అయితే ఇప్పటికే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ నేడు న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో మరో 57 పరుగులు చేస్తే 11 వేల మార్కును చేరుకుంటాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లి 221 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 10943 పరుగులు చేశాడు. అయితే ఈ రోజు మరో 57 పరుగులు కొహ్లీ చేయగలిగితే 11 వేల పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ 9వ స్థానంలో నిలబడతాడు. అదే భారత్ తరపున అయితే సచిన్, గంగూలీ తరువాత మూడో ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ నెలకొల్పుతాడు.