జబర్దస్త్ కి గైడ్ లైన్స్ పెట్టిన హై కోర్టు

Saturday, February 18th, 2017, 12:16:19 PM IST


గురు శుక్ర వారాలు రాత్రి పూట టీవీలో అందరినీ నవ్వించే ప్రోగ్రాం జబర్దస్త్ .. మొదట్లో ఓకే గానీ రాను రానూ ఈ ప్రోగ్రాం వల్గారిటీ ఎక్కువగా ఉంటోందో అనీ ఫామిలీ తో పాటు ఈ కార్యక్రమాన్ని చూడలేక పోతున్నాం అంటూ చాలా మంది వాపోతున్నారు. హాస్యం అనే పేరు పెట్టి డబల్ మీనింగ్ డైలాగులతో పేలిపోయే ఈ ప్రోగ్రాం భవిష్యత్తు ఇప్పుడు హై కోర్టు కి ఎక్కింది. 2014 జులై 10న జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన ఒక స్కిట్ లో న్యాయమూర్తుల్ని.. న్యాయవాదుల్ని కించపరిచేలా చేశారని.. దీని వల్ల న్యాయస్థానం పరువు ప్రతిష్ఠలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొంటూ న్యాయవాది అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా హుజురబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు.అనంతరం ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు చేరింది. తాజాగా ఈ కేసుపై తీర్పును ఇచ్చే క్రమంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. టీవీ కార్యక్రమాల్ని చిన్నా.. పెద్దా.. గ్రామీణ.. పట్టణ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు చూస్తుంటారని.. న్యాయవ్యవస్థపై చేసే వ్యాఖ్యలు ప్రజానీకం మనసుల్లో న్యాయవ్యవస్థ హుందాతనానికి భంగం వాటిల్లుతుందని.. తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తుందని వ్యాఖ్యానించింది.