వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..జగన్ ఎలా స్పందిస్తారో..!

Monday, August 12th, 2019, 03:15:15 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే గడిచినా టీడీపీ, బీజేపీలు మాత్రం అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే జగన్ వీటన్నిటికి ఓపికగానే సమాధానం చెబుతూ పోతున్నాడు.

అయితే అధికారంలో ఉన్న కారణంతో ప్రత్యర్ధి పార్టీలు విమర్శించడానికి ఎటువంటి అవకాశం జగన్ ఇవ్వకూడదని భావిస్తున్నా కొంత మంది సొంత పార్టీ నేతల వలన అది వీలుపడడంలేదు. అయితే నెల్లూర్ రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొద్ది రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం నరికేస్తా అంటూ ఓ విలేఖరిని బెదిరించిన వీడియోపై ప్రతిపక్షాలు, ప్రజలు దుమ్మెతి పోశారు. అయితే అప్పుడు జగన్ కాస్త జాగ్రత్తగా ఉండమని ఆయనకు వార్నింగ్ ఇచ్చినా ఆయన వైఖరి మాత్రం మారడంలేదు. తాజాగా జమీన్‌ రైతు వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ను అతడి ఇంటికెళ్ళి మరి కోటంరెడ్డి, తన అనుచరులు అతడిపై దాడి చేశారు. అయితే దీనిపై డోలేంద్ర ప్రసాద్‌ నేడు ఎమ్మెల్యేపై, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిన్నరాత్రి కోటం రెడ్డి తన అనుచరులతో మా ఇంటికి వచ్చారని ఎమ్మెల్యే ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారని ఏరా నాపైనే వార్త రాస్తావా? ఇప్పుడు నిన్ను చంపేస్తా మూడు పేజీల వార్త రాసుకో అంటూ బెదిరించారని, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్‌తోనా ఎవ్వరితో నైనా చెప్పుకో నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు అంటూ తనపై చేయి చేసుకున్నారని, తన వెంట ఉన్న అనుచరులు కూడా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మరి జగన్ మాత్రం ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.