బిగ్ న్యూస్: అసదుద్దీన్ పై కేసు నమోదు చేసిన జహంగీర్ బాద్ పోలీసులు!

Tuesday, November 12th, 2019, 12:14:35 PM IST

దేశమంతా అయోధ్య తీర్పు వచ్చిన రోజు ప్రజలు మద్దతు తెలిపారు. శాంతి పరమైన సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకున్నారు. అయితే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య తీర్పు విషయం లో చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అయోధ్య తీర్పు పై గౌరవం వుంది అంటూ చెబుతూనే, సుప్రీం తీర్పు పై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు.

బాబ్రీ మసీద్ ని కూల్చకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అక్కడ కావలసింది మసీద్ అని, ఐదెకరాల స్థలం కాదని, అలా విరాళం గా ఇచ్చే స్థలం మాకు అక్కరలేదని అన్నారు. అయితే ఈ విషయం లో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తం గా సంచలనం రేపుతున్నాయి. మధ్య ప్రదేశ్ లోని జహంగీర్ బాద్ లో పవన్ అనే వ్యక్తి అసద్ పై కేసు పెట్టారు. పోలీసులు వివరాలు పరిశీలించిన తరువాత అసదుద్దీన్ పై కేసు నమోదు చేసారు. అయోధ్య తీర్పు ని ఖండించడం తో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. దేశమంతా స్వాగతించిన తీర్పుని వ్యతిరేకించడం తో కేసుని పెట్టినట్లుగా పవన్ తెలిపారు.