హైద‌రాబాద్ ద‌త్త‌పీఠం బాబాపై రేప్ కేస్‌!

Monday, September 25th, 2017, 01:20:51 PM IST

డేరాబాబా అరెస్టుతో బాబాల గుండెల్లో గుబులు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. బాబాల‌పై రోజుకో కేసు న‌మోద‌వుతూ .. గుట్ట ర‌ట్ట‌వుతూ తాజా స‌న్నివేశం అవాక్క‌య్యేలా చేస్తోంది. మ‌గువ‌లంతా త‌మ‌పై జ‌రిగిన ఆకృత్యాల్ని బ‌హిరంగంగా చెబుతూ బాబాల భోగోతాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా డేరా బాబా త‌ర్వాత మ‌రో పెద్ద వికెట్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా భోగోతం ర‌ట్ట‌యింది. ఆయ‌న్ని పోలీసులు అరెస్టు చేసి శంక‌రమాన్యాలు ప‌ట్టించి 24 గంట‌లైనా కాక‌ముందే మ‌రో దొంగ బాబా గుట్టు ర‌ట్ట‌యింది.

తాజాగా హైద‌రాబాద్ -నాచారం దత్త పీఠం అధిపతిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారయత్నం చేశాడని, ల‌క్ష‌ల్లో గుంజాడ‌ని .. దత్త పీఠం అధిపతి శ్రీరామశర్మపై ఓ భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాచారం పోలీసులు రామ్‌శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇంట‌ర్నేష‌న‌ల్‌ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక బాబాపై రేప్‌ కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మునుముందు ఇలాంటి భోగోతాలు ఇంకెన్ని బ‌య‌ట‌ప‌డ‌నున్నాయో?

  •  
  •  
  •  
  •  

Comments