మగ ఓటర్ల కోసం ఎమ్మెల్యే అభ్యర్థి భార్య ఏమైనా చేస్తుందట !

Monday, January 30th, 2017, 03:24:51 PM IST

appppp
గోవాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాగా అక్కడ అధికారంలో ఉన్న బిజెపి మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి భార్య గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె గురించి మంత్రి ఓ బిజెపి కార్యకర్తతో అసభ్య కర వ్యాఖ్యలు చేయగా అవి వీడియో లో రికార్డ్ అయ్యాయి. గోవా కి చెందిన ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి విలిప్ తో పాటు ఆయన భార్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనితో బిజెపి మంత్రి మహాదేవ్ నాయక్ ఇటీవల శిరోదా లో పర్యటించినపుడు అక్కడున్న ఓ కార్యకర్త తో ఆమ్ గురించి అసభ్య కరమైన వ్యాఖ్యలు చేసారు. ఆమె ప్రచారంలో మగ ఓటర్లకు ఇతర మార్గాల్లో వల విసురుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వీడియో లో రికార్డ్ అయ్యాయి.

ఆ వీడియోని చేజిక్కించుకున్న విలిప్ భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్తని ఓడించడానికి బిజెపి కుట్ర పన్నుతోందని, తనపై అసభ్య కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది. వీడియో ఆధారంగా పోలీస్ లు మంత్రిపై కేసు నమోదు చేశారు.కాగా మంత్రి అనుచరులు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకుంటుంన్నారని సర్దిచెప్పుకుంటున్నారు.దీనిపై మంత్రి ఇంకా స్పందించలేదు. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 4 న జరగనుంది.