మహేష్ – కొరటాల పై కేసు నమోదు ?

Wednesday, January 25th, 2017, 11:02:23 PM IST

mahesh-koratala-siva
టాలీవుడ్ లో ‘బాహుబలి’ తరువాత వందకోట్ల మార్కెట్ సాధించిన సినిమాగా రికార్డ్ నెలకొల్పిన మహేష్ ”శ్రీమంతుడు” సినిమా అందరికి బాగా నచ్చింది. ఊర్లను దత్తత తీసుకోమని కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కాపీ అంటూ లేటెస్ట్ గా కోర్టులో కేసు నమోదైంది? ఆ వివరాల్లోకి వెళితే మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ”శ్రీమంతుడు” సినిమా తాను రాసిన ”చచ్చేంత ప్రేమ” అనే కథను 2012 లో రాసానని, ఆ కథ ఓకే వారపత్రికలో సీరియల్ గా వచ్చిందని కపి రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ? తనకు న్యాయం చేయాలనీ కోర్టుకు పిర్యాదు చేసిన అయన ఫిర్యాదును కోర్టు పరిశీలించి .. చిత్ర హీరో మహేష్ బాబు , దర్శకుడు కొరటాల శివకు, నిర్మాతలు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేసింది? అయినా ఎప్పుడో ఏడాది క్రితం వచ్చిన పోయిన సినిమాకు ఇప్పుడు కోర్టు కేసు ఏమిటో అని అంటున్నారు జనాలు?