పెళ్లి పేరుతో వంచించిన ఎమ్మెల్యే తనయుడు.. కేసు నమోదు..!

Friday, September 23rd, 2016, 05:09:03 PM IST

mla
రాజకీయ నేతల తనయులు కీచకులలా ప్రవర్తించడం రోజురోజుకు ఎక్కువైపోతోంది.మొన్నటికి మొన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఓ మహిళను లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజా ఏపీకి చెందిన మరో ఎమ్మెల్యే తనయుడు ఇలాంటి ఘనకార్యమే చేసాడు.తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తనయుడు ఓ గిరిజన మహిళ ను వంచించి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తనని పెళ్లిపేరుతో ఎమ్మెల్యే సుబ్బారావు తనయుడు రాజబాబు మోసం చేసాడని ఓ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీనితో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనితో రాజాబాబు పై అత్యాచారం కేసు నమోదైంది. యువతి తరుపు బంధువులు ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడిని రక్షించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పోలీస్ లు యువతిని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారు.