తమన్నా పై కేసు పెట్టిన నిర్మాత ?

Friday, September 30th, 2016, 03:00:05 PM IST

tamanna
గ్లామర్ భామ తమన్నా దూకుడు ఈ మధ్య మాములుగా లేదు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తూ .. మరో వైపు హాట్ హాట్ గా ఐటెమ్ సాంగ్ చేస్తూ జోరుమీదుంది. ఇప్పటికే ”అభినేత్రి” సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. మూడు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల అవుతుంది. ఇక లేటెస్ట్ గా తమన్నా ఫై ఓ నిర్మాత కేసు వేసాడు ? ఆ వివరాల్లోకి వెళితే .. తమన్నా సినిమా కమిట్ అయ్యేటప్పుడే ఆ సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొంటానని చెప్పిందట, రెమ్యూనరేషన్ కూడా అడిగినంత ఇచ్చారట, కానీ ఇప్పుడు ఆ ప్రమోషన్ కు రావడం లేదని నిర్మాత ఫైర్ అవుతున్నాడు. తమిళంలో తమన్నా ”ధర్మాదురై” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అయింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో చేసే ప్రమోషన్లో తమన్నా పాల్గొనడం లేదని, రమ్మని చెప్పిన రెస్పొండ్ అవ్వడం లేదని నిర్మాత సురేష్ నడిగర్ సంగంలో పిర్యాదు చేసాడు? ప్రస్తుతం తమన్నా విశాల్ సరసన ”కత్తి సందై” చిత్రంలో కూడా నటిస్తుంది. మరి ఈ విషయం పై నడిగర్ సంగంలో ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి !!