ఇండస్ట్రీలో మగవారిని వేధించే హీరోయిన్లూ వున్నారు : ప్రముఖ విలన్ సంచలన వ్యాఖ్యలు

Monday, June 11th, 2018, 02:40:19 PM IST

ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం పెను సంచలనమే రేగింది. నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కేస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీకి వచ్చే తెలుగు అమ్మయిలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసి పెను దుమారమే సృష్టించింది. అయితే ఇప్పటికీ సాగుతున్న ఆ ఘటన తర్వాత ఇక నేడు మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ప్రభావం పడుతోందని ప్రముఖ విలన్ పాత్రధారి, భోజపురి నటుడు రవి కిషన్ సంచలన ఆరోపణలు చేసారు. రేస్ గుర్రం చిత్రంతో మద్దాళి శివారెడ్డి పాత్రలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రవికిషన్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయం పై స్పందిస్తూ,

ఇక్కడ కేవలం కాస్టింగ్ కౌచ్ తరహా లైంగిక వేధింపులు ఆడవారిపై మాత్రమే జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని, నిజానికి అది పూర్తిగా వాస్తవం కాదని ఆయన అన్నారు. ఇక్కడ మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ప్రభావం ఉందని చెప్పారు. కొందరు హీరోయిన్లు ఇక్కడ మగవారిని సైతం ఆ విధంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. తెలుగు, భోజ్ పూరి, హిందీ వంటి పలు భాషలలో నటించిన రవికిషన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారంటే తనపై కూడా అటువంటివి జరిగి వుంటాయని, అందువల్లనే ఆయన అంత బహిరంగంగా చెపుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు……