`కాస్టింగ్ కౌచ్‌` అస‌లు మీనింగ్ ఇదీ..!

Saturday, April 14th, 2018, 08:56:25 PM IST


సినీ ఇండ‌స్ట్రీలో ఎన్న‌డూ లేనంతగా కాస్టింగ్ కౌచ్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. శ్రీ‌రెడ్డి ఎపిసోడ్స్‌తో ఇది ప‌రాకాష్ట‌లో ఉంది. వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో, 85ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఎన్న‌డూ లేనంత‌గా కాస్టింగ్ కౌచ్ ర‌చ్చ‌పై వాడివేడిగా చ‌ర్చ సాగుతోంది.

కాస్టింగ్ కౌచ్ అనేది హిందీలో ఎక్కువ‌గా వాడుక‌లో ఉన్న ప‌దం.. కాస్టింగ్ కౌచ్ అంటే క‌మిట్‌మెంట్‌. `ప‌క్క‌లో ప‌డుకుంటావా?` అన్న‌ది ప‌చ్చిగా తెలుగు అర్థం. క‌మిట్‌మెంట్ అని క్లాసీగా మాట్లాడుకుంటారు సినీజ‌నం. ప్రొడ‌క్ష‌న్‌లో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పార్ట్ మాత్రం కానేకాదు. ప్రీప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లాగా ఇది కూడా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో భాగం కాదు. గ‌తంలో కొంద‌రు ఆర్టిస్టులు క‌మిట్‌మెంట్లు ఇచ్చేవారు. వాళ్ల‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా అవ‌కాశాల కోసం ఇలా క‌మిట‌య్యేవారు. న‌లిగిపోయేవారు. ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌స్థ మ‌న సినిమా వ్య‌వస్థ‌లో బ‌లంగా కొనసాగుతోంది. మేనేజ‌ర్‌, కోడైరెక్ట‌ర్ దీనికి బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఒక డైరెక్ట‌ర్ హీరో, హీరోయిన్‌, టాప్ కాస్టింగ్ ఎంపిక చేసుకున్నాక‌.. మేనేజ‌ర్, కోడైరెక్ట‌ర్ల ప‌ని ప‌డుతుంది. వీళ్లు అమ్మాయిల్ని ఆడిష‌న్స్‌కి పిలుస్తారు. ఆడిష‌న్స్‌లోనే ఫ‌లానా పాత్ర నీకు ఇస్తాను.. నువ్వు నాతో ప‌డుకుంటావా? అని నేరుగా అడిగేస్తారు. ఆ క్ర‌మంలోనే సినిమాల్లో న‌టించాల‌న్న ఆరాటంలో అమ్మాయిలు త‌మ శీలాన్ని బ‌లిపెడుతుంటారు. ఓ సినిమాకి ప‌ని చేసే మేనేజ‌ర్ సైతం `నా ద‌గ్గ‌ర ప‌డుకుంటావా? ప‌డుకుంటేనే అవ‌కాశం` అని నేరుగా అడిగేస్తుంటారు. అయితే ఇలాంటి దారుణాలు అనాదిగా న‌డుస్తూనే ఉన్నా క‌ట్ట‌డి లేక‌పోవ‌డం అమానుషం.

  •  
  •  
  •  
  •  

Comments