ఆ నిర్మాత సినిమాలు తీసేది దానికోసమేనట ?

Monday, April 16th, 2018, 11:12:58 AM IST

తాజాగా శ్రీ రెడ్డి .. రేపిన సంచలనం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో సంచలనం గా మారింది. సినిమా హీరోయిన్స్ పై లైంగిక వేధింపుల విషయం ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని వుడ్స్ లోను ఉన్నదే. మహిళల పై లైంగిక వేధింపులు ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక శ్రీ రెడ్డి వ్యవహారం తో పలువురు వ్యవహారం బయటకు లీక్ అవుతున్నాయి. ఇప్పటికే ఆమె ట్విట్టర్ లో పలు విషయాలకు సంబందించిన లీక్ లను పోస్ట్ చేస్తుంది. తాజాగా నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం వ్యవహారం బయట పెట్టిన విషయం తెలిసిందే. తాజగా ఓ టాప్ నిర్మాత వ్యవహరమ్ పై పలు వార్తలు వస్తున్నాయి.

సదరు నిర్మాత హీరోయిన్స్ తో ముందే కమిట్మెంట్ తీసుకుంటాడని, ఆ హీరోయిన్స్ తో పలువురు పొలిటికల్ పెద్దలతో రిలేషన్ పెంచుకునేందుకు వీళ్ళను వాడుకుంటున్నాడని టాక్. పైగా అయన కూడా రాజకీయంగా ఎదగడం కోసమే సినిమా రంగంలోకి వచ్చాడని, సినిమాల్లో ప్రముఖ హీరోయిన్స్ తో ఈ తరహా పరిచయాలను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు నిర్మాత గత పదిహేనేళ్లుగా ఇదే విధంగా చేస్తున్నాడని, అయన సినిమాలు తీసేది ఇందుకోసమే అని వార్తలు వినిపిస్తున్నాయి. వ్యాపార రంగంనుండి వచ్చిన ఆ నిర్మాత ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా మారాడని, అయన సినిమాల్లో అన్ని విషయాలకు కమిట్ అయినా హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తాడని ప్రచారం జరుగుంది. మరి సదరు ప్రొడ్యూసర్ ఎవరన్నా విషయం పై ఆరాలు తీస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments