బోయపాటికి సెంటిమెంట్ గా మారిన గ్లామర్ హీరోయిన్ ?

Friday, May 11th, 2018, 10:15:31 AM IST

మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ బ్యాంకాంక్ వెళ్ళింది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన మీదట గ్లామర్ భామ కేథరిన్ తో ఈ ఐటెం సాంగ్ చేయించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడట. ఆ మధ్య ఖైదీ నంబర్ 150 లో మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కేథరిన్ కు ఇప్పుడు మెగా వారసుడితో డాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇక కేథరిన్ సరైనోడు సినిమాతో ఎంఎల్ ఏ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జయజానకి నాయక సినిమాలోనూ నటించింది. మొత్తానికి తన సినిమాల్లో వరుసగా ఈ అమ్మడిని నటింప చేస్తున్న బోయపాటి శ్రీను కు కేథరిన్ సెంటిమెంట్ గా మారిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. అందుకే ఆమెతో ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయిస్తున్నాడేమో !!

  •  
  •  
  •  
  •  

Comments