రానాపై పగ తీర్చుకుంటానంటున్న హీరోయిన్ ?

Wednesday, February 22nd, 2017, 06:25:55 PM IST


ఏంటి ? హీరో రానాపై ఎందుకు పగ తీర్చుకుంటుంది? ఇంతకి రానా ఏమి చేసాడు !! అంటూ ఏదేదో ఊహించేసుకోకండి ? ఆమె పగ తీర్చుకుంటానని చెప్పింది సినిమాలో, నిజంగా కాదు? ఆ వివరాల్లోకి వెళితే .. గ్లామర్ భామ కేథరిన్ ట్రెసాకు లేటెస్ట్ గా సరైనోడు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. ఇక కొద్దిలో మెగాస్టార్ 150వ సినిమాలో రత్తాలు .. రత్తాలు ఐటెం సాంగ్ మిస్ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేథరిన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందట !! హీరో రానా పై పగ తీర్చుకునే అమ్మాయిగా కనిపిస్తుందని, గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో హ్యాపీ గా ఫీల్ అవుతుందట. హీరోయిన్ నెగిటివ్ అయినా తరువాత రియలైజ్ అయి మళ్ళీ హీరోను లవ్ చేయడం కామనే కదా !! అయితే ఈ సినిమాలో కేథరిన్ పాత్ర చివరివరకు అలాగే ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది.