జగన్ ప్లాన్ భలే ఉందిగా..

Friday, September 20th, 2019, 06:50:24 PM IST

ఆస్తుల కేసు విచారణలో జగన్ గతం లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత హాజరు మినహాయించాల్సిందిగా జగన్ కోర్ట్ ని కోరారు. గతంలో ఈ పిటిషన్ ని నాంపల్లి సిబిఐ కోర్ట్ కొట్టివేసింది. కానీ ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో వున్నారు. మరోక సారి పిటిషన్ దాఖలు చేసారు. వ్యక్తి గత హాజరు మినహాయించాలని, తనకి బదులుగా తన లాయరు హాజరయ్యేలా చూస్తానని అన్నారు.

ఒకసారి కొట్టివేసిన రెండో సరి ఎలా పిటిషన్ వేస్తారు అని అడగగా, జగన్ తరపు లాయర్ ఇలా అన్నారు, పరిస్థితులు మారాయని, ముఖ్యమంత్రి గా పాలనలో చాల బిజీ గా ఉంటున్నట్లు తెలిపారు. తమ ప్రాంతం నుండి హైదరాబాద్ కి రావడం ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం అని అన్నారు.