సుజ‌నా చుట్టూ ఉచ్చు.. `మోదీ-కేసీఆర్-జ‌గ‌న్` ఎఫెక్ట్‌!!

Sunday, June 2nd, 2019, 10:31:52 AM IST

అవినీతి జ‌ల‌గ‌ల‌పై మోదీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఎటాక్ స్టార్ట్ చేయ‌డం షురూ అయ్యిందా? ముఖ్యంగా ఏపీ అవినీతి జ‌ల‌గ‌ల్లో కీల‌క వ్య‌క్తులుగా చెబుతున్న కొంద‌రు తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు మూడిందా? అంటే అవున‌నే తాజా న్నివేశం చెబుతోంది. ఇన్నాళ్లు అవినీతితో ప్ర‌జ‌ల ర‌క్తం తాగిన రాజ‌కీయ జ‌ల‌గ‌ల్ని ప‌ట్టి తాగిన ర‌క్తం మొత్తం పిండే ప‌నిలో ప‌డ్డార‌ని తాజా సీన్ చెబుతోంది. అస‌లే తేదేపా ఓట‌మి పాలై పూర్తిగా డీలా ప‌డిపోయిన నేప‌థ్యంలో ఆ పార్టీని పూర్తిగా నామ‌రూపాల్లేకుండా చేయాల‌న్న పంతం `మోదీ-కేసీఆర్-జ‌గ‌న్` త్ర‌యంలో క‌నిపిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. అదంతా అటుంచితే .. తాజాగా ఏపీ- తేదేపా కీల‌క నాయ‌కుడు .. ఎన్టీవీ అధినేత సుజ‌నా చౌద‌రి భ‌ర‌తం ప‌ట్టేందుకు మోదీ మ‌రోసారి ఎటాక్ స్టార్ట్ చేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సుజ‌నా ఇంట్లో.. ఆఫీస్ కార్యాల‌యాల్లో సీబీఐ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు అత‌డిపై ఐటీ ఎటాక్ లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సుజ‌నా ఏమాత్రం ఊహించ‌ని రీతిలో ఈసారి ఆయ‌న ఇల్లు .. కార్యాల‌యాల్ని సీబీఐ అధికారుల బృందం త‌నిఖీలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. క‌ర్నాట‌క నుంచి వ‌చ్చిన సీబీఐ టీమ్ పంజాగుట్ట నాగార్జున స‌ర్కిల్ లోని సుజ‌నా ఆఫీస్.. జూబ్లీ హిల్స్ లోని కార్యాల‌యాల్లో శ‌నివారం ఉద‌యం నుంచి త‌నిఖీల ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఒకేసారి సుజ‌నాకి చెందిన ఆఫీసులు- కార్యాల‌యాల్లో మూడు చోట్ల త‌నిఖీలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. సుజ‌నా గ్రూప్ డైరెక్ట‌ర్ల‌లో ప‌లువురిని అదుపులోకి తీసుకుని సీబీఐ ప్ర‌శ్నించిందిట‌. బ్యాంకుల్ని మోసం చేసి అప్పులు తీసుకోవ‌డం వాటిని ఎగ్గొట్ట‌డం వంటి కేసులు సుజ‌నాపై ముప్పిరిగొలుపుతున్న సంగ‌తి తెలిసిందే. సుజ‌నా కంపెనీల్లో శ్రీనివాస కళ్యాణ్ రావు – వెంకట రమణారెడ్డి – సుధాకర్ రెడ్డి రామకృష్ణ వర్మ త‌దిత‌రులు బోర్డ్ డైరెక్ట‌ర్లుగా ప‌ని చేస్తున్నారు. వీళ్ల‌ను సీబీఐ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయ‌ని తెలుస్తోంది. `బెస్ట్ అండ్ కాంప్టన్’ పేరుతో తెలుగుదేశం నేత మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడితో కలిసి సుజనా వ్యాపాారాలు చేసేప్పుడు బ్యాంకుల నుంచి ప‌లు అప్పులు తీసుకుని ఎగ‌వేశారు. దీనిపై ఆద్యంతం అన్ని ర‌కాల ఆధారాల్ని ఇదిర‌కూ సేక‌రించిన సీబీఐ ఈసారి ప‌నిని సంపూర్ణం చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తేదేపా నాయ‌కుల్లో అవినీతి నాయ‌కుల జాబితా మొత్తం సిద్ధం చేసిన న‌రేంద్ర మోదీ ఒక్కొక్క‌రిని వెంటాడు వేటాడు త‌ర‌హాలో వేట ఖాయం చేశార‌ని ముచ్చ‌ట సాగుతోంది.