మరో ముప్పై రోజుల్లో పది రెట్లు పెరగనున్న కరోనా కేసులు!

Monday, May 25th, 2020, 10:41:00 PM IST

ప్రస్తుతం భారత దేశం చాల క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే భారత్ లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది అని చెబుతున్న పరిస్తితి మాత్రం వేరేలా ఉంది అని తెలుస్తోంది. మరో 30 రోజుల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అనే సీసీ ఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. అయితే ఈ మహమ్మారి వ్యాప్తి గురించి సంచలన విషయాలను వెల్లడించారు.

ఈ వైరస్ వ్యాప్తి ఇపుడు ఉన్న దాని కంటే అయిదు నుండి పడి రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని, పాజిటివ్ కేసులు అదే తరహాలో నమోదు అవుతాయి అని వ్యాఖ్యానించారు.అయితే అందరు ఎండాకాలం కారణంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుతుంది అని భావిస్తుండగా, ఉష్ణోగ్రతలు పెరిగిన అంతా మాత్రాన వైరస్ వ్యాప్తి ఆగదు అని తేల్చి చెప్పారు. వాక్సిన్ రావడానికి ఇంకా కనీసం 6 నెలల సమయం పక్కగా పడుతుంది అను అన్నారు.

అయితే వాక్సిన్ కొన్నిటి మీద పని చేసినా మరి కొన్నిటి పై ప్రభావం ఉండకపోవచ్చు అని వ్యాఖ్యానించారు.అయితే వాక్సిన్ కంటే కూడా స్వీయ నియంత్రన ముఖ్యం అని వివరించారు.మిగతా రాష్ట్రాల తో పోల్చితే తెలంగాణ లో ఉన్న వైరస్ చాలా భిన్నంగా ఉంది అని అన్నారు.