హీరోయిన్స్ కూతుళ్లతో దర్శకుడు, హీరో పార్టీలు

Sunday, November 5th, 2017, 06:37:46 PM IST

బాలీవుడ్ లో సినీ తారలకు సంబందించి కూతుళ్లు ఎక్కువ మందే ఉన్నారు. వారు తెరగ్రేటం చేయకముందే హీరోయిన్స్ కంటే ఎక్కువ స్థాయిలో పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు ఇస్తున్న ఫొటో స్టిల్స్ చాలా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా సోషల్ మీడియాలో బాలీవూడ్ అప్ కమింగ్ హీరోయిన్స్ ఫొటో ఒకటి చాలా వైరల్ అవుతోంది. అందులో తరాల కూతుళ్లు ఎక్కువగా ఉండడం స్పెషల్ అని చెప్పాలి. రీసెంట్ గా దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన పద్మావతి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తలిసిందే.

అయితే రెస్పాన్స్ సూపర్బ్ గా రావడంతో దీపికా పదుకొనే ఇండస్ట్రీలోని సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. శనివారం నైట్ చేసుకున్న ఈ పార్టీకి కరణ్ జోహార్ తో పాటు హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ – సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వచ్చారు. అయితే ఈ ఇద్దరి భామలతో కరణ్ సెల్ఫీ దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే పద్మావతి సినిమాలో కీలక పాత్ర చేస్తోన్న రణవీర్ సింగ్ జాన్వీ, సారాలతో దిగిన ఫొటో కూడా అందరిని ఆకర్షిస్తోంది. జాన్వీ, సారాలు వారి సినిమాలతో బిజీగా ఉన్నారు సారా ఇప్పటికే ‘కేదార్‌నాథ్’ అనే ఒక సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసింది. ఇక జాన్వీ కూడా సైరత్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమాను కరణ్ జోహార్ తెరకెక్కించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments