కేజ్రీవాల్ సినిమాకు లైన్ క్లియర్ .. ఎలాంటి దుమారం రేగుతుందో ?

Sunday, October 15th, 2017, 11:05:58 AM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఈ సినిమా విడుదలకు సెన్సార్ వాళ్ళు ఎందుకో పర్మిషన్ ఇవ్వలేదు. చాలా రోజులుగా ఈ సినిమా విడుదలకోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికన్ మీడియా సంస్థ వైస్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. దాంతో ఈ విషయాన్నీ పరిశీలించిన ట్రిబ్యునల్ సినిమా విడుదలకు అనుమతించింది. ఖుష్బూ రంక, వీణ శుక్ల కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ”ఆన్ ఇన్ సిగ్నిఫికెంట్ మాన్” పేరుతొ విడుదల చేయనున్నారు. ఇండియాలో లంచగొండి తనానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం, ఢిల్లోలో అధికారం వంటి విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. మరి సినిమా విడుదల తరువాత ఇంకెలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments