పీకే లో సీన్స్ కట్ చేసేందుకు నిరాకరణ

Tuesday, December 30th, 2014, 08:58:06 PM IST

pk
అమీర్ ఖాన్ నటించిన సంచలనాత్మక చిత్రం పీకే సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎంత సంచలన విజయాన్ని సాధించిందో… అంతే వివాదాలకు తెరలేపింది. ఇందులో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, హిందూ దేవుళ్ళను మతాలను తక్కువ చేసి చూపించే విధంగా ఉన్నాయంటూ ఆర్ఎస్ఎస్, భజరింగదళ్ లు ఆందోళన చేస్తున్నాయి. ఇక, ఈ పీకే చిత్రాన్ని నిషేదించాలని, ఈ చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి బహిష్కరించాలని యోగ గురువు రామ్ దేవ్ బాబా డిమాండ్ చేశారు. బాబా రాందేవ్ కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అనూహ్యంగా రాందేవ్ బాబాకు మద్దతు పలికింది.

ఇక ఇది ఇలా ఉంటే, పీకే సినిమాలోని సీన్స్ ను కట్ చేసేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఇప్పటికే, సినిమా విడుదల చేసిన నేపధ్యంలో సీన్స్ కట్ చేసేందుకు కుదరదని బోర్డు పేర్కొన్నది.