200 కోట్ల `ప‌ద్మావ‌తి`కి అస‌లు శత్రువు ఎవ‌రు?

Friday, December 1st, 2017, 12:14:35 PM IST

గ‌త నెల‌రోజులుగా `ప‌ద్మావ‌తి` ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఇంత‌కీ ఈ సినిమా రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అంటూ డిబేట్ న‌డుస్తోందిప్పుడు. దాదాపు 200 కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన భ‌న్సాలీ అండ్ టీమ్ రిలీజెప్పుడో రామ‌చంద్రా! అంటూ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. వంద‌ల కుటుంబాలు ఆధార‌ప‌డి ఉన్న వ్య‌వ‌హార‌మిది. సినిమాకి ఏమైనా అంద‌రి బ‌తుకులు ఏం కావాలి? అయితే ఈ సినిమా రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అవ్వ‌క‌పోతే అస‌లు శ‌త్రువు ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

అస‌లు వాస్త‌వం క‌నుగొంటే .. దిమ్మ‌తిరిగే నిజం తెలిసింది. అస‌లు ఈ సినిమా రిలీజ్‌కి ఆటంకాలు సృష్టిస్తోంది క‌ర్ణిసేన‌లు కానే కాదని తేలిపోయింది. ఈ సినిమా రిలీజ్‌కి ఆటంకాలు క‌లిగిస్తోంది సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ స‌ర్టిఫికేష‌న్ అధికారులే. ఆ విష‌యం పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స‌మావేశం సాక్షిగా ప్రూవైంది. క‌ర్ణిసేన‌ల ఆగ‌డాల‌పై కోర్టుకెళ్లిన భ‌న్సాలీ.. అక్క‌డ సానుకూల ప‌వ‌నాలు వీచ‌డంతో ఎంతో సంతోషించారు. అయితే సీబీఎఫ్‌సీ అడ్డుచెప్ప‌క‌పోతే రిలీజ్‌కి ఆటంకాలు తొలగిపోయేవే. కానీ అస‌లు మ‌క‌తిక ఇక్క‌డే ఉంది. “మాకు సినిమా చూపించ‌క ముందే, రిలీజ్ చేయ‌క ముందే మీడియాకి సినిమా చూపిస్తావా? ఇది ఎంత‌టి అవ‌మానం?“ అంటూ సెన్సార్ బోర్డ్ అధ్య‌క్షుడు ప్ర‌సూన్ జోషి విరుచుకుప‌డ‌డం చూస్తుంటే అస‌లు ఈ సినిమాకి శ‌త్రువు ఎవ‌రో అర్థ‌మైపోయింది. అయితే దీనికి భ‌న్సాలీ స‌మాధానం ఇచ్చుకున్నారు ప్యానెల్ ఎదుట‌. వంద‌ల కోట్లు పెట్టాను మ‌హాప్ర‌భో! ఆ కంగారులో ఏమైపోతుందోన‌ని ముందుగా మీడియాకి చూపించేశాను.. అని భ‌న్సాలీ నెత్తి నోరు బాదుకున్నారు. అయినా సెన్సార్ క‌రుణించకుందా.. ఇప్ప‌టికీ రిలీజ్ విష‌యం త‌ర్వాత చూద్దాం అని తేల్చేసింది. ఇంకా చెప్పాలంటే ముందు మీడియాకి ఎందుకు చూపించారో తేలాలి అంటూ పంచాయితీని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది సీబీఎఫ్‌సీ బృందం. ఇక‌పోతే సీబీఎఫ్‌సీ కి మ‌ద్ద‌తు ప‌లుకుతూ పార్ల‌మెంట‌రీ ప్యానెల్ అధ్య‌క్షుడు ఠాకూర్ సైతం అలా ఎందుకు చేశారు? అంటూ వంత పాడారు. సినిమాలో పాత్ర‌ల‌న్నీ ఫిక్ష‌న‌ల్‌. అలాంట‌ప్పుడు చ‌రిత్ర‌కు సంబంధించిన పేర్లు ఎందుకు వాడారు? ఎమోష‌న్‌తో ఆడుకుని సొమ్ములు చేసుకోవాల‌నుకున్నారా? అంటూ భ‌న్సాలీని జోషి, ఠాకూర్‌ ప్ర‌శ్నించిన తీరుని బ‌ట్టి అసలేం జ‌రుగుతోందో అర్థం చేసుకోవాలి. ఓ ర‌కంగా సెన్సార్ బోర్డ్ అధ్య‌క్షుని ఈగో స‌మ‌స్య‌ల‌కు
200 కోట్ల సినిమాని బ‌లి పెడుతున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

  •  
  •  
  •  
  •  

Comments