ఏపీ, తెలంగాణ సర్కార్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..!

Thursday, October 17th, 2019, 11:48:51 PM IST

ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు నూతనంగా 16 మంది ఐఏఎస్‌లను నియమించేందుకు ప్రకటన జారీ చేసింది. అయితే ఏపీ రాష్ట్రానికి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే కొత్త ప్రభుత్వాలు ఎర్పడ్దాకా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పలు శాఖలకు సంబంధించి ఐఏఎస్‌ల అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడంతో జిల్లాకో ఐఏఎస్‌ అధికారి అవసరం ఏర్పడింది. అయితే అటు ఏపీలో కూడ జిల్లాల పెంపుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపధ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఐఏఎస్‌ అధికారులను కేటాయిస్తూ తీపికబురు అందించింది.