చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భద్రత తొలగింపు..!

Monday, January 13th, 2020, 10:08:30 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు రక్షణ కల్పించే బ్యాక్ క్యాట్ కమాండోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రబాబుతో సహా దాదాపు 13 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్న ఈ బ్లాక్ క్యాట్ కమాండోలను రద్దు చేసేసింది.

అయితే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దాదాపు 350 మంది వీఐపీలకు భద్రతను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరికొంత మందిని తప్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన దాదాపు 450 మంది ఎన్ఎస్జీ కమాండోలు అందుబాటులోకి రావడంతో వీరందరిని భారత్‌లో పలుచోట్ల దాడులు జరుగుతాయన్న సమాచారంతో అక్కడికి పంపాలని కేంద్రం భావిస్తుంది. అయితే ఇక నుంచి చంద్రబాబుతో సహా పలు ప్రముఖుల రక్షణ బాధ్యతలను పారా మిలిటరీ దళాలు చూసుకోబోతున్నట్టు సమాచారం.