హరీశ్‌రావుకు కీలక కమిటీలో చోటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం..!

Thursday, July 23rd, 2020, 11:15:33 AM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కేంద్రం కీలక కమిటీలో చోటు కల్పించింది. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై పని చేసేందుకు 2019 డిసెంబరులో జీఎస్టీ మండలి మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కేంద్రం ఈ కమిటీలో కొన్ని మార్పులు చేసింది. ఐజీఎస్టీ కమిటీకి సంబంధించి ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి బీహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీని కన్వీనర్‌గా నియమించారు.