టీకాల్లో వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత…మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

Tuesday, June 8th, 2021, 07:17:42 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం గా పూర్తి చేసేందుకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే వృథా ఎక్కువగా ఉంటే కేటాయింపుల్లో కోత ఉండే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. అయితే దేశంలో ఉత్పత్తి అయ్యే వాక్సిన్ లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. టీకా పంపిణీ లో ప్రాధాన్యత ను సైతం పేర్కొంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, 45 ఏళ్లు పైబడిన వారికి,రెండో డోస్ వేయించుకోవాల్సిన వారు, 18 ఏళ్లు దాటిన వారికి వరుస ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.

అయితే 18 ఏళ్లు దాటిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంతంగా నిర్ణయం తీసుకొని పంపిణీ కార్యక్రమం చేపట్టాలి అని తెలిపింది. అయితే వీటితో కరోనా వైరస్ వాక్సిన్ కేంద్రాలు, మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.