తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై కేంద్రం సీరియస్!

Thursday, May 21st, 2020, 10:18:24 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటే, తెలంగాణలో ఇప్పటివరకు కేవలం 21 వేల పరీక్షలు మాత్రమే జరిగాయి అని తెలిపింది. ఇలానే నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే భవిష్యత్ లో తీవ్ర నష్టం తప్పదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.

అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నీ అరికట్టాలంటే, ఐసీఎంఅర్ నిబంధనల మేరకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.అయితే దేశంలో ఎక్కువగా గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా తక్కువగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అన్నారు.అంతేకాక ఐసీఎంఅర్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అన్నారు. వీటివల్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందడం లేదు అని స్పష్టంగా వివరించారు.