కరోనా ఎఫెక్ట్: కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

Wednesday, April 14th, 2021, 04:04:42 PM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు కూడా లక్ష కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే నేడు రెండు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాక వెయ్యికి పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు వాయిదా వేసింది. అయితే విద్యార్థుల ప్రతిభా, పని తీరు ఆధారంగా మార్కులు వేయనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తో సమీక్ష సమావేశం అయిన విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు మాత్రం రద్దు చేసింది. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు తెలుస్తోంది.అయితే జూన్ 1 వ తేదీన పరిస్థతినీ సమీక్షించి తదుపరి పరీక్షల తేదీ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.