తెలంగాణ ప్రభుత్వం పై మండిపడుతున్న కేంద్రమంత్రి – మరీ ఇంత దారుణమా…?

Saturday, September 21st, 2019, 02:36:40 AM IST

నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణాలో అధికారంలోకి వచినప్పటినుండి కూడా తెలంగాణ లో తెరాస పార్టీ చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని, అంతేకాకుండా చాలా దుర్మార్గపు పనులకు తెరతీస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు 5 లక్షల రూపాయల విలువ చేసే ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడంలేదని కిషన్ రెడ్డి మండిపడుతున్నారు.

ఐకపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కెసిఆర్ కుటుంబ పాలన జరుగుతున్నదని, దానికితోడు కొత్తగా ఒవైసీ కుటుంబం కూడా తోడైందని, ఆ రెండు కుటుంబాలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే మనదేశంలో కుల, మత, కుటుంబ పాలన అనేది లేకుండా చేస్తున్నది ఒక్క ప్రధాని మోడీ అని, దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్నటువంటి నాయకుడు ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.