చంపుతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్దికి ఫోన్ కాల్..!

Friday, June 14th, 2019, 01:38:15 PM IST

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మంది బడా వ్యాపారవేతలకు, సామాన్యులకు ఫోన్లు చేసి అది కావాలి, ఇది కావాలి లేకపోతే మిమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తూ ఉంటారు. తరచూ మనం ఇలాంటి సంఘటనల గురించి వింటూనే ఉంటాము. అయితే ఎవరో తెలియదు, ఎందుకోసమో తెలియదు ఏకంగా ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ కాల్ చేసి చంపుతానంటూ బెదిరిస్తున్నారు.

అయితే గత నెల 20వ తేదిన ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్ ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అయితే గత కొద్ది రోజులుగా మంత్రి పదవి ప్రమాణ స్వీకారం , పలు శాఖకు సంబంధించిన పనులపై బిజీగా కిషన్ రెడ్డి తాజాగా తనకు వచ్చిన బెదిరింపు కాల్ దృష్ట్యా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్‌ నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనకు కాల్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే కిషన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచి, పోలీస్ నిఘా వ్యవస్థను అలర్ట్ చేశారు. అయితే కేసు నమోదు చేసుకుని ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.