బీజేపీలోకి చేరబోతున్న తెలుగు అగ్ర నిర్మాత

Wednesday, September 18th, 2019, 07:21:00 PM IST

తెలుగులో మెగా నిర్మాతగా పేరు తెచ్చుకున్నవైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ మరి కొద్దీ రోజుల్లో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విజయవాడకి చెందిన చలసాని వారి వాస్తవ్యుడు అయిన అశ్వినీదత్ కి మొదటి నుండి తెలుగుదేశం అంటే వీరాభిమానం. ఎన్టీఆర్ నాటి నుండి కూడా టీడీపీతో ఆయనకి మంచి బంధం ఉంది, చంద్రబాబు హయాంలో కూడా అది కొనసాగుతుంది.

అయితే మారిన రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని బీజేపీలోకి ఆయన వెళ్లాలని అనుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి – రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ .. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు అశ్వినీదత్ కార్యాలయంలో ఆయన్ని కలిశారు. దాదాపు గంటన్నరకి పైగా వాళ్ళ మధ్య చర్చలు నడిసినట్లు తెలుస్తుంది.

మోదీ పాలన గురించి, ఆర్టికల్ 370 రద్దు గురించి అశ్వినీదత్ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చకి వచ్చినట్లు తెలుస్తుంది. అశ్వినీదత్ ని బీజేపీలోకి చేరమని అడగటానికి కేంద్ర మంత్రి స్వయంగా దత్ ఆఫీస్ కి వచ్చినట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొద్దీ రోజుల్లో దత్ గారు కాషాయ జెండా కప్పుకునే అవకాశం లేకపోలేదు.