బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు – కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

Tuesday, November 29th, 2016, 02:42:54 PM IST

rajavarthan-rathod-singh
బాహుబలి మొదటి భాగం విడుదల అయినప్పటి నుంచీ అందరి మనసులలో మిగిలిపోయిన ఒకటే ప్రశ్న ” బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ” అని మాత్రమే. ఈ విషయం మీద మౌళి కానీ ఇతర నటీనటులు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తనకి ఆ విషయం తెలుసు అనీ దానికి ఆన్సర్ తనదగ్గర ఉంది అనీ అంటున్నారు కేంద్ర మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్.బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో స్వయంగా రాజమౌళే తనకు చెప్పారని… అందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలియాల్సి ఉంటుందని… కానీ, ఇలాంటి విషయాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుందనే రాజమౌళికి కూడా తెలుసని… అందుకే ఆయన ఆ విషయాన్ని తనకు తెలిపారని సరదాగా అన్నారు. అయితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సీక్రెట్ ను మాత్రం రాజ్యవర్ధన్ కూడా చెప్పకుండా దాటవేశారు.