మతం గురించి మాట్లాడుతే మోడీ నైనా సరే వదలద్దు…!!

Friday, November 4th, 2016, 03:38:18 PM IST

cc
కుల, మత, జాతి, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ప్రపంచానికే ఆదర్శంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారత్ లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలను చూస్తే మనకు స్పష్టంగా అర్థం అయ్యే విషయం ఏంటంటే మన దేశ రాజకీయాలు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. అత్యధిక ప్రజలున్న కులాలకు రాజకీయ నాయకులు వంత పాడి వారి ఓట్లను రాబట్టడానికి ప్రాజాస్వామ్య విధానికి బదులు కులాలకు జై కొట్టి ఓట్లను రాబట్టి కుల రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తున్నారు. అయితే నేడు మత కుల రాజకీయాలను ప్రోత్సహించడంతో పాటు వాటి మధ్య అగ్గి రగల్చడం నేటి రాజకీయాలలో షరా మామూలైపోయింది. అయితే ఈ కుల, మత రాజకీయాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండు రోజుల పాటు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీపీఐ మహాసభలను ఆయన గురువారం ప్రారంభించారు. చాడ మాట్లాడుతూ.. సెక్యులర్ దేశంగా ఉన్న భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడేవాళ్లు.. ప్రధాని నరేంద్రమోదీ అయినా, కేంద్రమంత్రులైనా సరే వాళ్లను జైల్లో పెట్టాల్సిందేనని అన్నారు.